Parliament: పొగాకు ఉత్పత్తుల వాడకందారుల కనీస వయోపరిమితి పెంపు.. ముసాయిదా బిల్లు రూపొందిస్తోన్న‌ కేంద్రం

 new cigarettes draft bill will introduce in parliament

  • సిగరెట్లు సహా పొగాకు ఉత్పత్తుల వాడకంపై నిబంధ‌న‌లు
  • 21 ఏళ్ల‌లోపు వారికి అమ్మితే  ఏడేళ్ల వ‌రకు జైలు శిక్ష‌
  • ల‌క్ష రూపాయ‌ల జ‌రిమానా
  • బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు తాగితే  జరిమానా మ‌రింత పెంపు
  • విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తులు జ‌ర‌పకూడదు 

దేశంలో సిగరెట్లు సహా పొగాకు ఉత్పత్తుల వాడకంపై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. వాటి వాడకానికి ఉన్న‌ వయో పరిమితిని పెంచుతూ ముసాయిదా బిల్లును సిద్ధం చేస్తోంది. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులను వాడేవారికి కనీస వయసు 18 ఏళ్లు ఉండాలన్న నిబంధన ఇప్ప‌టివ‌ర‌కు ఉంది.

ఇప్పడీ వ‌యోప‌రిమితి 21 ఏళ్ల‌కు పెంచాల‌ని ముసాయిదా బిల్లులో పేర్కొన్నారు. మ‌రికొన్ని మార్పుల‌తో కేంద్ర ప్ర‌భుత్వం చట్ట సవరణ చేయనుంది. ఇప్ప‌టివ‌ర‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌ వ‌యో ప‌రిమితిలోపు ఉన్న వారికి సిగ‌రెట్లు స‌హా పొగాకు ఉత్ప‌త్తుల‌కు అమ్మిన వారికి రెండేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించేవారు.

కొత్త చట్టం ద్వారా ఆ శిక్షను ఏడేళ్ల వ‌ర‌కు పెంచ‌డ‌మే కాకుండా, జరిమానాను రూ.లక్షకు పెంచనున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే, లూజు (ప్యాకెట్లు కాకుండా విడిగా) సిగరెట్ల అమ్మకాలపై నిషేధం విధించాలని కూడా ముసాయిదా బిల్లులో ప్రతిపాదన‌లు చేశారు. అంతేగాక‌, బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు తాగితే విధించే జరిమానానూ పెంచనున్నారు.

హోట‌ళ్ల‌లో సిగ‌రెట్లు తాగ‌కూడ‌దు. మ‌రోవైపు, ధూమ‌పానం కోసం రెస్టారెంట్లు, విమానాశ్రయాల్లో ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ప్రత్యేక గదులు, స్థలాలను  మూసివేయ‌నున్నారు. విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు జ‌రిపితే కూడా జ‌రిమానా విధిస్తారు.

  • Loading...

More Telugu News