Sensex: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in losses

  • లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
  • 80 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 8 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి లాభాల్లోనే కొనసాగిన మార్కెట్లు చివరి గంటలో నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ స్టాకుల్లో లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టాలను చవి చూశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 80 పాయింట్లు నష్టపోయి 48,093కి పడిపోయింది. నిఫ్టీ 8 పాయింట్లు కోల్పోయి 14,137 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (3.75%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.22%), యాక్సిస్ బ్యాంక్ (2.48%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.31%), ఎల్ అండ్ టీ (1.92%).

టాప్ లూజర్స్:
టైటాన్ కంపెనీ (-2.03%), నెస్లే ఇండియా (-2.00%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.97%), ఇన్ఫోసిస్ (-1.53%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.38%).

  • Loading...

More Telugu News