Centre: ఈ ఆరు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ... నిర్ధారించిన కేంద్రం

 Centre says Bird Flu spreads to six states till now

  • దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం
  • ఇప్పటివరకు ఆరు రాష్ట్రాలకు పాకిన బర్డ్ ఫ్లూ
  • మధ్యప్రదేశ్, హర్యానా, కేరళ, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ
  • హర్యానాలో 1.60 లక్షల కోళ్ల వధకు నిర్ణయం

ఓవైపు దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలోనే పలు రాష్ట్రాలు బర్డ్ ఫ్లూ కలకలంతో ఉలిక్కిపడ్డాయి. పెద్ద సంఖ్యలో కాకులు మృతి చెందుతుండడంతో బర్డ్ ఫ్లూపై కేంద్రం అప్రమత్తమైంది. శుక్రవారం నాటికి ఆరు రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఫ్లూ) వ్యాప్తి చెందిందని కేంద్రం వెల్లడించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఉనికి వెల్లడైందని తెలిపింది.

ఇప్పటికే కేరళ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ఏవియన్ ఫ్లూ పరిస్థితుల పరిశీలనకు కేంద్ర బృందాలు రంగంలోకి దిగాయి. హర్యానాలో కొన్ని కోళ్ల ఫారాల నుంచి సేకరించిన నమూనాలు బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని రావడంతో 1.60 లక్షల కోళ్లను వధించనున్నారు. బర్డ్ ఫ్లూపై కోళ్ల ఫారాల యాజమాన్యాలకు అవగాహన కల్పించేందుకు హర్యానా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దేశం మొత్తమ్మీద చాలా రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ లేకపోయినా, పరిస్థితులపై ఓ కన్నేసి ఉంచాలని కేంద్రం ఆయా రాష్ట్రాలకు స్పష్టం చేసింది .

  • Loading...

More Telugu News