Gujarat: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మాధవసింగ్ సోలంకీ కన్నుమూత

Former Gujarat Chief Minister Madhav Singh Solanki passes away

  • గుజరాత్‌కు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సోలంకి
  • మోదీకి ముందు అత్యధిక కాలం సీఎంగా సేవలు
  • ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని మోదీ

కాంగ్రెస్ సీనియర్ నేత, గుజరాత్ ముఖ్యమంత్రిగా నాలుగుసార్లు పనిచేసిన మాధవ్ సింగ్ సోలంకి ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 93 సంవత్సరాలు. 1991-92 మధ్య విదేశీ వ్యవహారాల మంత్రిగానూ ఆయన పనిచేశారు.  

సోలంకి గొప్ప నేత అని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. గుజరాత్ రాజకీయాల్లో దశాబ్దాలపాటు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. సమాజానికి విశేష సేవలు అందించారన్నారు. ఆయన మృతికి విచారం వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు భరత్ సోలింకితో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అలాగే గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ చావ్డా కూడా సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. సోలంకి తన పనులతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు.

రాజ్యసభ సభ్యుడిగా రెండుసార్లు పనిచేసిన సోలంకి.. క్షత్రియులు, హరిజనులు, ఆదివాసీ, ముస్లింలతో కూడిన (కేహెచ్ఏఎం) ఫార్ములాతో ఎన్నికలకు వెళ్లి కాంగ్రెస్‌కు విజయాన్ని అందించిపెట్టారు. నరేంద్రమోదీ కంటే ముందు గుజరాత్‌కు అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఆయన కుమారుడు భరత్ సిన్హ్ సోలంకి కేంద్ర మంత్రిగా పనిచేశారు.

  • Loading...

More Telugu News