brazil: వ్యాక్సిన్ త్వరగా పంపాలంటూ మోదీకి బ్రెజిల్ అధ్యక్షుడి లేఖ
- కరోనా విజృంభణతో వణికిపోతోన్న బ్రెజిల్
- వ్యాక్సిన్ కోసం ఎదురుచూపులు
- భారత్ లో తయారవుతున్న కొవిషీల్డ్ కోసం ఇప్పటికే ఆర్డర్
- 2 మిలియన్ల డోసులను కోరిన బ్రెజిల్
కరోనా విజృంభణతో బ్రెజిల్ వణికిపోతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం భారత్ నుంచి ఆ దేశం ఎదురుచూపులు చూస్తోంది. భారత్ కు చెందిన కంపెనీలతో వ్యాక్సిన్ కోసం ఇప్పటికే బ్రెజిల్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో వ్యాక్సిన్ ను త్వరగా పంపాలంటూ భారత ప్రధాని నరేంద్రమోదీకి బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో లేఖ రాశారు.
బ్రెజిల్ లో మ్యూనైజేషన్ ప్రొగ్రామ్‌ను అత్యవసరంగా అమలు చేయాల్సిన అత్యవసరం ఉందని, అందుకే భారత్‌లో ఆక్స్ ఫర్డ్- ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ కోసం ఇప్పటికే ఆర్డర్ చేసుకున్న 2 మిలియన్ల డోసులను వీలైంతన త్వరగా పంపించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఇప్పటివరకు ఆ దేశంలో కరోనా కారణంగా 2 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్‌కు చెందిన కొన్ని ప్రైవేటు సంస్థలు తమ దేశంలో వ్యాక్సిన్ పంపిణీ కోసం భారత్ తో ఒప్పందం చేసుకున్నాయి.