West Bengal: రావణాసురుడు కాకుండా అతడి అనుచరులు అపహరించి ఉంటేనా?.. సీతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ

TMC MP uses offensive words for Sita
  • కల్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలపై దుమారం
  • ఎఫ్ఐఆర్ నమోదు
  • మహిళ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి వ్యాఖ్యలా? అంటూ బీజేపీ నేతల మండిపాటు
పురాణ పాత్ర సీతాదేవిపై పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తనను రావణాసురుడు అపహరించాడు కాబట్టి సరిపోయిందని, అదే అతడి అనుచరులు కనుక ఆ పనిచేసి ఉంటే తన పరిస్థితి హత్రాస్ ఘటనలా తయారయ్యేదని ఎంపీ పేర్కొన్నట్టుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

కల్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలపై హౌరాలోని గోల్‌బారీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. రామాయణ, మహాభారతాలను అవమానించిన కల్యాణ్ బెనర్జీ రానున్న ఎన్నికల్లో ప్రతిఫలం అందుకోక తప్పదని బీజేపీ నేత లాకెట్ చటర్జీ హెచ్చరించారు. ఓ మహిళ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ కంటే బెంగాల్‌లోనే ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సీతాదేవిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు కల్యాణ్ బెనర్జీ వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేత ఆశిష్ జయపాల్ డిమాండ్ చేశారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
West Bengal
Kalyan Banerjee
Sita Devi
BJP

More Telugu News