Justice Eshwaraiah: హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్యకు షాకిచ్చిన సుప్రీంకోర్టు
- జడ్జి రామకృష్ణతో ఈశ్వరయ్య మాట్లాడింది నిజమేనన్న ప్రశాంత్ భూషణ్
- ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలన్న సుప్రీం
- న్యాయ వ్యవస్థను నాశనం చేసేలా వ్యవహరించారన్న కపిల్ సిబల్
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్యకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. జడ్జి రామకృష్ణతో జరిపిన ఫోన్ సంభాషణపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసులో ఈశ్వరయ్య తరపున ప్రశాంత్ భూషణ్ వాదించగా.... వ్యతిరేకంగా కపిల్ సిబల్ వాదలను వినిపించారు.
జడ్జి రామకృష్ణతో ఈశ్వరయ్య మాట్లాడింది నిజమేనని ఈ సందర్భంగా ప్రశాంత్ భూషణ్ ఒప్పుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. మరోవైపు, కపిల్ సిబల్ మాట్లాడుతూ, న్యాయవ్యవస్థను నాశనం చేసే విధంగా ఈశ్వరయ్య వ్యవహరించారని చెప్పారు. వాదనలను విన్న సుప్రీంకోర్టు... హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.