You Tube: ఈసారి.. ట్రంప్ యూట్యూబ్ ఛానెల్ నిలిపివేత‌!

You Tube Suspends Trump Channel Temporarily

  • ఇప్ప‌టికే ప‌లు సోష‌ల్ మీడియా అకౌంట్ల నిలిపివేత‌
  • తాజాగా అప్‌లోడ్ చేసిన కంటెంట్ డిలీట్
  • హింస‌ను ప్రేరేపించేలా కంటెంట్?
  • వారం  రోజుల పాటు వీడియోల‌ను అప్‌లోడ్ చేయలేరు

క్యాపిటల్‌ బిల్డింగ్ ‌పై దాడి అనంత‌రం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తోన్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే  ఆయ‌న అధికారిక‌ ట్విట్ట‌ర్ అకౌంట్‌ను ఆ సంస్థ‌ బ్యాన్ చేసింది. అలాగే, ఇప్ప‌టికే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఖాతాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
 
ఇప్పుడు ఆయ‌న‌ యూట్యూబ్ ఖాతాను కూడా తాత్కాలికంగా స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ఆ సంస్థ‌ ప్ర‌క‌టించింది. అందులో తాజాగా అప్‌లోడ్ చేసిన కంటెంట్‌ను యూట్యూబ్ డిలీట్ చేసింది. యూట్యూబ్ నిబంధ‌న‌ల‌ను అందులో ఉల్లంఘించిన‌ట్లు  యూట్యూబ్ తెలిపింది.  

హింస‌ను ప్రేరేపించేలా అందులో కంటెంట్ ఉండ‌డంతో యూట్యూబ్ ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు స‌మాచారం. వారం  రోజుల పాటు ట్రంప్ త‌న‌ ఛాన‌ల్‌లో వీడియోల‌ను అప్‌లోడ్ చేయలేరు. కాగా, ట్రంప్ ఛాన‌ల్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ కొన్ని సామాజిక సంఘాలు డిమాండ్ చేయ‌డంతో యూట్యూబ్ ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఆ ఛానెల్ పై చ‌ర్య‌లు తీసుకోక‌పోతే దానికి వాణిజ్య ప్ర‌క‌ట‌నల‌ను నిలిపివేసేలా ప్ర‌చారం చేప‌డుతామ‌ని ఆ సంస్థ‌లు హెచ్చ‌రించాయి.  అందులో ఎన్నిక‌ల గురించి  అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్న‌ట్లు ఆరోపించాయి. అధ్య‌క్ష‌ ఎన్నిక‌ల్లో మోసం జ‌రిగిన‌ట్లు ఓ వీడియోలో ట్రంప్ వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఛాన‌ల్‌కు 2.77 మిలియ‌న్ల స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు.

  • Loading...

More Telugu News