Stock Market: స్టాక్ మార్కెట్ సూచీలకు నిజంగానే సంక్రాంతి!
- నిన్న నష్టాలతో ముగిసిన మార్కెట్
- ఇవాళ ఆరంభంలో ఒడిదుడుకులు
- ఐటీ రంగంలో లాభాల స్వీకరణకు మదుపరుల యత్నం
- అండగా నిలిచిన ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లు
భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. సంక్రాంతి పండుగ రోజున నిర్వహించిన ట్రేడింగ్ లో గరిష్ఠ స్థాయి అందుకున్నాయి. ఓ దశలో ఐటీ రంగం షేర్లపై లాభాల స్వీకరణకు మదుపరులు యత్నించడంతో బెంచ్ మార్క్ సూచీలు దిగువ చూపులు చూడగా, ఎనర్జీ, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్ల అమ్మకాలతో సూచీలు మళ్లీ పుంజుకున్నాయి.
దాంతో బుధవారం నాటి నష్టాలు ఇవాళ మరుగునపడ్డాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 92 పాయింట్ల వృద్ధితో 49,584 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 30 పాయింట్ల లాభంతో 14,595 వద్ద ముగిసింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, టీసీఎస్ షేర్లు లాభపడగా, హెచ్ సీఎల్ టెక్, మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, జేఎస్ డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టాలు చవిచూశాయి.