Brisbane: గబ్బా టెస్ట్: 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

Australia lost Openers in Fourth test
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
  • ఓపెనర్లు ఇద్దరూ అవుట్
  • తొలి వికెట్ తీసిన హైదరాబాదీ సిరాజ్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌ను హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ తొలి దెబ్బ కొట్టాడు. నాలుగు పరుగుల వద్ద డేవిడ్ వార్నర్ (1)ను పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత 17 పరుగుల వద్ద ఆసీస్ మరో వికెట్ కోల్పోయింది.

శార్దూల్ ఠాకూర్ బౌలింగులో మార్కస్ హారిస్ ఔటయ్యాడు. దీంతో 17 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. మార్కస్ లబుషేన్ (5), స్టీవ్ స్మిత్ (3) క్రీజులో ఉన్నారు. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు జరగ్గా, రెండు జట్లూ చెరో మ్యాచ్ నూ గెలిచాయి. సిడ్నీలో జరిగిన మూడో టెస్టు డ్రా అయింది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది.
Brisbane
Gabba
India
Australia
Test Match

More Telugu News