Covishield: తొలి విడతలో గర్భిణులు, బాలింతలకు టీకా లేనట్టే!
- గర్భిణులు, బాలింతలపై జరగని టీకా ట్రయల్స్
- రెండు డోసులు ఒకే కంపెనీవై ఉండాలి
- 18 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వ్యాక్సినేషన్
- మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
దేశవ్యాప్తంగా రేపటి నుంచి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుండగా, కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఒక్కో వ్యక్తికి రెండు డోసులు ఇవ్వనుండగా, రెండూ ఒకే కంపెనీకి చెందినవై ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
అలాగే, ఈ విడతలో గర్భవతులు, బాలింతలకు టీకా ఇవ్వొద్దని ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. కొవిషీల్డ్, కొవాగ్జిన్‌లకు సంబంధించి ఫ్యాక్ట్‌షీట్‌ను షేర్ చేసింది. వ్యాక్సిన్‌ను ఎవరెవరికి ఇవ్వాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలను అందులో పేర్కొంది.
ఈ విడతలో 18 ఏళ్లు, ఆ పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తారు. తొలిసారి వేసిన కంపెనీ డోసునే రెండో డోసులోనూ ఇవ్వాల్సి ఉంటుంది. కొవిడ్ వ్యాక్సినేషన్ ట్రయల్స్‌లో గర్భిణులు, బాలింతలు భాగం కాలేదు కాబట్టి ఈసారి వారికి టీకా ఇవ్వరు. వ్యాక్సిన్ వేసేముందు వారికి ఎవైనా సమస్యలు ఉన్నాయేమో అడిగి తెలుసుకోవాలి. కాగా, భారత్‌లో కరోనా వ్యాక్సిన్ ధర రూ. 200-రూ.295 మధ్య ఉండే అవకాశం ఉంది.