Vishnu Vardhan Reddy: పెనుకొండ కోటలో దొరికిన హిందూ దేవతల విగ్రహాలను నిర్లక్ష్యంగా పడేశారు: విష్ణువర్ధన్ రెడ్డి

Vishnu Vardhan Reddy says idols dumped on ground

  • పెనుకొండ వద్ద పురాతన విగ్రహాలు లభ్యం
  • పురావస్తు శాఖ పట్టించుకోవడంలేదన్న విష్ణు
  • నేలపైనే వదిలేశారని ఆరోపణ
  • సీఎం జగన్ కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఏపీ సర్కారుపై విమర్శలు చేశారు. పెనుకొండ వద్ద విజయనగర కోటలో పురాతనమైన హిందూ దేవతల విగ్రహాలు దొరికాయని, అయితే ఆ విగ్రహాల పట్ల జగన్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. ఆ ప్రాచీన విగ్రహాలను రాష్ట్ర పురావస్తు శాఖ ఏమాత్రం పట్టించుకోకుండా నేలపై పడేసిందని తెలిపారు. ఈ వైఖరి ఆమోదయోగ్యం కాదని, అందుకు బాధ్యులైన అధికారులపై సీఎం జగన్ కఠిన చర్యలు తీసుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News