Narendra Modi: మోదీ 'వ్యాక్సినేషన్' ప్రసంగంలో మహాకవి గురజాడ పలుకులు
- సొంత లాభం కొంత మానుకోవాలి
- పొరుగువారికి తోడ్పడాలని గురజాడ అన్నారు
- దేశమంటే మట్టి కాదోయ్ అన్నారు
- దేశమంటే మనుషులోయ్ అని గురజాడ సందేశాన్ని ఇచ్చారు
దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రక్రియను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మహాకవి గురజాడ అప్పారావు పలుకులను గుర్తు చేశారు. సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడ్పడాలని గురజాడ అన్నారని మోదీ చెప్పారు. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని గురజాడ సందేశాన్ని ఇచ్చారని మోదీ గుర్తుచేశారు.
భారత్ ఈ సూత్రం ఆధారంగానే పని చేస్తోందని చెప్పారు. దేశంలోని అందరి కోసం వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారని, కరోనా సంక్షోభ సమయంలోనూ ఇళ్ల నుంచి వచ్చి పనులు చేశారని ఆయన కొనియాడారు. కాగా, కరోనా పరీక్షల కోసం మొదట్లో దేశంలో ఒక్క ల్యాబ్ మాత్రమే ఉండేదని, ప్రస్తుతం దేశంలో 33 వేలకుపైగా ల్యాబులు ఉన్నాయని వివరించారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం అనుకూలమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.