Andhra Pradesh: కొత్త ప్రాజెక్టుల ఆకర్షణలో ఏపీకి రెండో స్థానం

AP stands in second place for investments grabbing

  • ప్రాజెక్ట్స్ టుడే జాతీయస్థాయి నివేదిక
  • మూడో త్రైమాసికంలో రాష్ట్రానికి రూ.29,784 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు
  • 108 ప్రతిపాదనలు వచ్చినట్టు నివేదికలో వెల్లడి
  • జాతీయస్థాయి పెట్టుబడుల్లో ఏపీ వాటా 10.77 శాతం

ఇటీవలే ఏబీసీ, సీ-ఓటర్ సర్వేలో ఏపీ సీఎం జగన్ మూడోస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా, కొత్త ప్రాజెక్టుల ఆకర్షణలో ఏపీకి రెండో స్థానం లభించింది. ప్రాజెక్ట్స్ టుడే జాతీయ స్థాయి నివేదికలో ఈ మేరకు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబరు-డిసెంబరు)లో రాష్ట్రంలో కొత్తగా రూ.29,784 కోట్ల విలువైన పెట్టుబడులకు 108 ప్రతిపాదనలు వచ్చినట్టు ప్రాజెక్ట్స్ టుడే వెల్లడించింది. అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య కాలంలో దేశవ్యాప్తంగా రూ.2,76,483 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రకటన వెలువడితే, అందులో ఏపీ వాటా 10.77 శాతం అని ఆ నివేదికలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News