West Bengal: ఎన్నికల తర్వాత మమతా బెనర్జీ బంగ్లాదేశ్‌కు వెళ్లిపోతారు: బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
- మమత ఇస్లామిక్ ఉగ్రవాది
- దేశానికి ఆమె అత్యంత ప్రమాదకారి
- అక్కడి ఉగ్రవాదుల మార్గనిర్దేశకత్వంలో ఆమె పనిచేస్తున్నారు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై యూపీ బీజేపీ నేత, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మమత బంగ్లాదేశీయురాలని, రాష్ట్రంలో జరిగే శాసనసభ ఎన్నికల తర్వాత ఆమె బంగ్లాదేశ్‌కు శరణార్థిగా వెళ్లిపోతారని వ్యాఖ్యానించి కలకలం రేపారు. అంతేకాదు, ఆమెను ఇస్లామిక్ ఉగ్రవాదిగా అభివర్ణించారు.
మమతా బెనర్జీ పూర్తిగా బంగ్లాదేశ్ దేశీయురాలేనని పేర్కొన్న శుక్లా.. అక్కడి ఇస్లామిక్ ఉగ్రవాదుల మార్గనిర్దేశకత్వంలో ఇక్కడ పనిచేస్తున్నారని ఆరోపించారు. దేశానికి ఆమె అత్యంత ప్రమాదకారిగా తయారయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె బంగ్లాదేశ్ వెళ్లిపోయి అక్కడే తలదాచుకుంటారని శుక్లా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.