Ward Boy: యూపీలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వార్డు బోయ్ మృతి

Hospital ward boy dead after taking Corona vaccine

  • మొరాదాబాద్ లో శనివారం వ్యాక్సిన్ తీసుకున్న వార్డ్ బోయ్
  • ఛాతీనొప్పి, శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధ పడ్డ వైనం
  • వ్యాక్సిన్ వల్ల చనిపోయాడని భావించడం లేదన్న చీఫ్ మెడికల్ ఆఫీసర్

కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వ్యాక్సిన్ తీసుకున్న ఆసుపత్రి వార్డు బోయ్ మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మహిపాల్ సింగ్ అనే వార్డు బోయ్ సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఛాతీనొప్పి, శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడ్డాడు. ఆ తర్వాత ప్రాణాలు వదిలాడు.

దీనిపై ఆసుపత్రి చీఫ్ మెడికల్ అధికారి మాట్లాడుతూ, శనివారం మధ్యాహ్నం కోవిషీల్డ్ తొలి డోసు తీసుకున్నాడని... నిన్న అతనికి శ్వాస ఆడక, ఛాతినొప్పితో బాధ పడ్డాడని తెలిపారు. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత నైట్ షిఫ్ట్ చేశాడని చెప్పారు. అయితే, వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ తో అతను చనిపోయాడని తాను భావించడం లేదని చెప్పారు. మహిపాల్ మరణానికి గల కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

మరోవైపు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా ఉన్న ఓ వ్యక్తికి కూడా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సమస్యలు తలెత్తాయి. దీంతో, అతడిని ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అతనికి రియాక్షన్ తలెత్తింది. తలపోటు, దద్దుర్లు, శ్వాస సంబంధిత సమస్యలతో అతను బాధపడ్డాడు.

  • Loading...

More Telugu News