Bike Ambulance: సీఆర్పీఎఫ్ సూచనలతో బైక్ అంబులెన్స్ ను అభివృద్ధి చేసిన డీఆర్డీఓ

DRDO designs bike ambulance
  • డీఆర్డీఓ మరో ఆవిష్కరణ
  • అటవీ, కొండ ప్రాంతాల్లో వినియోగానికి బైక్ అంబులెన్స్ లు
  • మావోయిస్టు ప్రాంతాలకు అనువుగా రూపకల్పన
  • ప్రయోగాత్మకంగా పలు చోట్ల పరిశీలన
దేశ రక్షణ నిమిత్తం ఆయుధాలు రూపొందించే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ప్రజా ఉపయోగ ఆవిష్కరణలకు కూడా ప్రాధాన్యమిస్తోంది. తాజాగా డీఆర్డీఓ పరిశోధకులు ఓ బైక్ అంబులెన్స్ ను రూపొందించారు. సీఆర్పీఎఫ్ సూచనల మేరకు ఈ బైక్ అంబులెన్స్ ను అభివృద్ధి చేశారు. ఈ బైక్ అంబులెన్స్ ను మావోయిస్టు ప్రభావిత అటవీప్రాంతాల్లోనూ, కొండ ప్రాంతాల్లోనూ వినియోగించేందుకు అనువుగా మలిచారు. భద్రతా బలగాల్లో ఎవరైనా గాయపడితే అత్యవసర పరిస్థితుల్లో వారిని తరలించేందుకు ఈ బైక్ అంబులెన్స్ లు ఉపయోగిస్తారు. రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులకు మార్పులు, చేర్పులు చేసి ఒక వ్యక్తిని సురక్షితంగా ఆసుపత్రికి తరలించేలా రూపుదిద్దారు. ఇప్పటికే వీటిని పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించారు.
Bike Ambulance
DRDO
CRPF
India

More Telugu News