Rafale: రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా రాఫెల్ యుద్ధ విమానం

Rafale to participate in Republic Day celebrations

  • జనవరి 26న గణతంత్ర వేడుకలు
  • వెర్టికల్ చార్లీ విన్యాసాలు చేయనున్న రాఫెల్
  • మొత్తం 38 విమానాలతో వాయుసేన గగన విహారం
  • ఇటీవలే ఫ్రాన్స్ నుంచి భారత్ కు అందిన రాఫెల్ విమానాలు

భారత వాయుసేన అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రం అనదగ్గ రాఫెల్ జెట్ ఫైటర్ ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఫ్రాన్స్ కు చెందిన ఈ అధునాతన యుద్ధ విమానాలు ఇటీవలే భారత్ కు చేరాయి. వీటిలో ఒకదాన్ని జనవరి 26న గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా రాఫెల్ జెట్ విమానం 'వెర్టికల్ చార్లీ' విన్యాసాలు నిర్వహించనుందని వాయుసేన వర్గాలు వెల్లడించాయి.

సాధారణంగా ముందుకు పయనించే విమానాలు... అందుకు భిన్నంగా నిట్టనిలువుగా ఆకాశంలోకి దూసుకెళ్లడాన్నే 'వెర్టికల్ చార్లీ' విన్యాసం అంటారు. ఈ క్రమంలో విమానం మెలికలు తిరుగుతూ అగ్నికీలలను వెదజల్లుతుంది. వింగ్ కమాండర్ ఇంద్రనీల్ నంది మాట్లాడుతూ, వెర్టికల్ చార్లీ విన్యాసాల్లో ఒక రాఫెల్ విమానం పాల్గొంటుందని వెల్లడించారు. ఓవరాల్ గా 38 భారత వాయుసేన విమానాలు గణతంత్ర వేడుకల్లో గగన విహారం చేస్తాయని వివరించారు.

  • Loading...

More Telugu News