Maharashtra: పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన భర్త.. భుజాలపై మోస్తూ ఊరేగించిన భార్య!

Woman carries husband on shoulders to celebrate panchayat polls victory

  • మహారాష్ట్రలోని పూణే జిల్లాలో పంచాయతీ ఎన్నికలు
  • 'పలు' గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికైన సంతోష్ గౌరవ్
  • భర్తను మోస్తూ ఊరంతా తిప్పుతూ సంబరాలు చేసుకున్న భార్య

ఎన్నికల్లో గెలిచిన తన భర్తను భుజాలపై మోస్తూ ఊరేగించిందో ఇల్లాలు. మహారాష్ట్రలోని పూణేలో జరిగిందీ ఘటన. పూణే జిల్లాలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగాయి. సోమవారం ఎన్నికల ఫలితాలు రాగా, ఖేడ్ తాలూకాలోని 'పలు' అనే గ్రామానికి సంతోష్ గౌరవ్ అనే వ్యక్తి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. దీంతో ఆనందంతో ఉప్పొంగిపోయిన భార్య రేణుక.. అతడిని భుజాలపై ఎక్కించుకుని ఊరంతా తిప్పుతూ ఊరేగించింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అక్కడ విజయోత్సవాలను ఘనంగా జరుపుకోవడంపై కలెక్టర్ నిషేధం విధించారు. సంబరాల్లో ఐదుగురి కంటే ఎక్కువమంది కనిపించకూడదని ఆంక్షలు విధించారు. అలాగే, కొవిడ్ నేపథ్యంలో భౌతికదూరం తప్పనిసరని పేర్కొన్నారు. దీంతో భర్తను భుజంపై మోస్తూ కేవలం ఐదుగురితోనే రేణుక సంబరాలు చేసుకుంది. భర్తను భుజాలపై మోస్తూ సంబరాలు చేసుకున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News