Gold Rates: వరుసగా మూడో రోజూ పెరిగిన పుత్తడి ధర!
- నేడు పది గ్రాములకు రూ.347 పెరుగుదల
- దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ. 48,758
- పసిడి బాటలోనే పయనించిన వెండి
రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధర నేడు మూడో రోజు కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధరపై నేడు రూ. 347 పెరిగింది. ఫలితంగా ఢిల్లీలో పది గ్రాముల పుత్తడి ధర రూ. 48,758కి పెరిగింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలోకు రూ. 606 పెరిగి రూ. 65,814 వద్ద స్థిరపడింది.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,854 డాలర్లు పలకగా, వెండి ధర 25.28 డాలర్లుగా ఉంది. కాగా, పసిడి ధర సోమవారం రూ.117 పెరగ్గా, మంగళవారం రూ. 198 పెరిగింది. నేడు ఏకంగా రూ. 347 పెరిగింది. వెండి కూడా వరుస పెరుగుదలను నమోదు చేసింది. సోమవారం కిలోకు రూ. 541, మంగళవారం రూ. 1,008 పెరగ్గా, నేడు రూ. 606 పెరిగింది.