Sasikala: శశికళ కోసం పోయెస్ గార్డెన్ లో నిర్మితమవుతున్న భారీ భవంతి
- 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న భవంతి
- ఈ నెల 27న జైలు నుంచి విడుదల అవుతున్న శశికళ
- వెయ్యి వాహనాలతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు
అక్రమాస్తుల కేసులో దివంగత జయలలిత నెచ్చెలి శశికళ బెంగళూరు పరప్పణ అగ్రహారం జైల్లో శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 27న ఆమె జైలు నుంచి విడుదల కాబోతున్నారు. మరోవైపు జయలలిత నివాసం ఉన్న పోయెస్ గార్డెన్ లోనే ఆమె ఉండాలనుకుంటున్నారు.
జయ నివసించిన వేద నిలయం ఎదురుగా ఉన్న 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆమె కోసం భారీ భవంతి నిర్మితమవుతోంది. ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మరోవైపు శశికళకు భారీ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీటీవీ దినకరన్ అనుచరులు ఈ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. దాదాపు వెయ్యి వాహనాలతో శశికళకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.