Mumbai Police: ఆన్ లైన్లో నకిలీ షాపింగ్ వెబ్ సైట్లు ఇవిగో... గుట్టురట్టు చేసిన ముంబయి పోలీసులు

Mumbai police busted fake online shopping sites

  • గుజరాత్ లో ఐటీ నిపుణుడి అరెస్ట్
  • రూ.70 లక్షలకు పైగా స్వాహా చేసినట్టు గుర్తింపు
  • 22 వేల మందికి పైగా బాధితులు
  •  ఆన్ లైన్ మోసాలపై హెచ్చరిక చేసిన ముంబయి పోలీసులు

ముంబయి పోలీసులు ఆన్ లైన్లో వినియోగదారులను మోసం చేస్తున్న నకిలీ షాపింగ్ వెబ్ సైట్ల గుట్టురట్టు చేశారు. గుజరాత్ లో ఓ ఐటీ నిపుణుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఫేక్ ఆన్ లైన్ షాపింగ్ రాకెట్ ను బట్టబయలు చేశారు. గృహోపకరణాల అమ్మకం పేరిట ప్రజలను బురిడీ కొట్టిస్తూ రూ.70 లక్షలకు పైగా స్వాహా చేసినట్టు పోలీసులు గుర్తించారు.

ఈ నకిలీ షాపింగ్ వెబ్ సైట్లతో 22 వేల మందికి పైగా మోసపోయినట్టు తేలింది. ముంబయి పోలీసులు ఈ మేరకు ట్విట్టర్ లో ఆయా నకిలీ షాపింగ్ వెబ్ సైట్ల జాబితాను కూడా పంచుకున్నారు. డిస్కౌంట్ల కోసం వెంపర్లాడితే అవి మీ బ్యాంకు అకౌంట్లను వెంటాడతాయని ముంబయి పోలీసులు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News