Pawan Kalyan: మీరు ఎలాగూ కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకం... కనీసం ఈడబ్ల్యూఎస్ అయినా అమలు చేయండి: సీఎం జగన్ కు పవన్ సూచన

Pawan Kalyan asks CM Jagan to implement EWS in AP

  • తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు
  • 10 శాతం అమలుకు సీఎం కేసీఆర్ నిర్ణయం
  • సీఎం కేసీఆర్ ను అభినందించిన పవన్ కల్యాణ్
  • కేసీఆర్ స్ఫూర్తితో సీఎం జగన్ కూడా నిర్ణయం తీసుకోవాలని సలహా

ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు లబ్ది చేకూరేలా తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ (ఎకనామికల్లీ వీకర్ సెక్షన్) రిజర్వేషన్ల అమలుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తెలంగాణలో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఏపీలో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు.

"తెలంగాణ ముఖ్యమంత్రి అందించిన స్ఫూర్తితో గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్రంలోనూ 10 శాతం ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలి. ఉద్యోగాల్లోనూ, విద్యలోనూ, ఆర్థికంగానూ వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు ఎంతో కొంత ఉపశమనం ఉంటుంది. కాపులకు కూడా ఇది ఊరట కలిగిస్తుంది. మీరు ఎలాగూ కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకం కాబట్టి కనీసం ఈడబ్ల్యూఎస్ అయినా అమలు చేయండి. తద్వారా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు మేలు చేయండి" అంటూ పవన్ విజ్ఞప్తి చేశారు. 

  • Loading...

More Telugu News