Ramatheertham: రామతీర్థం ఘటన: ఏ1గా చంద్రబాబు.. ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు
- రామతీర్థం ఘటనలో 12 మందిని ముద్దాయిలుగా పేర్కొన్న పోలీసులు
- ఏడుగురికి రిమాండ్
- ఏ 2, ఏ 3లుగా అచ్చెన్న, కళా వెంకటరావు
విజయనగరం జిల్లా రామతీర్థంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై జరిగిన దాడి కేసులో నెల్లిమర్ల పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబును ఇందులో ఏ1గా పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి వాహనంపై రాళ్లదాడికి ఆయనే ప్రధానకారణమని అందులో పేర్కొన్నారు.
అలాగే, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును ఏ2గా, మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావును ఏ3గా పేర్కొన్నారు. ప్రాథమిక విచారణ అనంతరం వీరిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు, అచ్చెన్న, కళా వెంకటరావుతోపాటు మొత్తం 12 మందిని పోలీసులు ముద్దాయిలుగా పేర్కొన్నారు. అరెస్ట్ అయిన ఏడుగురికి కోర్టు ఇప్పటికే రిమాండ్ విధించింది.