Nimmagadda Ramesh Kumar: వీడియో కాన్ఫరెన్స్ వాయిదా వేయాలన్న సీఎస్ అభ్యర్థనను తిరస్కరించిన నిమ్మగడ్డ
- ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన ఎస్ఈసీ
- హాజరు కాలేమన్న సీఎస్
- సీఎస్ కు లేఖ రాసిన ఎస్ఈసీ
- హాజరు కావాల్సిందేనంటూ స్పష్టీకరణ
పంచాయతీ ఎన్నికల విషయం, కరోనా వ్యాక్సినేషన్ అంశం చర్చించేందుకు సీఎస్, డీజీపీ, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు తాము రాలేమని సీఎస్ ఆదిత్యనాథ్ ఎన్నికల సంఘానికి తెలిపారు.
అయితే, సీఎస్ అభ్యర్థనను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరస్కరించారు. వీడియో కాన్ఫరెన్స్ కు ప్రాధాన్యత ఉందని, హాజరు కావాల్సిందేనంటూ ఆ మేరకు సీఎస్ కు లేఖ రాశారు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిందని, వ్యాక్సినేషన్, ఎన్నికలపై చర్చకు వీడియో కాన్ఫరెన్స్ సరైన వేదిక అని ఎస్ఈసీ తన లేఖలో వివరించారు. అందరి సహకారం లభిస్తేనే ఎన్నికలు సజావుగా పూర్తి చేయగలమని స్పష్టం చేశారు.