Sasikala: నిలకడగా శశికళ ఆరోగ్యం... తాజా బులెటిన్ విడుదల
- అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన శశికళ
- బెంగళూరు విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స
- ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు
- నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నారని వెల్లడి
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయ లలిత నెచ్చెలి శశికళ ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరు విక్టోరియా ఆసుపత్రి వైద్యులు తాజా బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆ బులెటిన్ లో వెల్లడించారు. చికిత్సకు సౌకర్యవంతంగానే స్పందిస్తున్నారని, నోటి ద్వారా సాధారణ రీతిలో ఆహారం తీసుకుంటున్నారని వివరించారు. ప్రస్తుతం ఆమె స్పృహలోనే ఉన్నారని, విషమ పరిస్థితిని అధిగమించారని తెలిపారు. అయితే, ఇప్పటికీ ఆమెకు ఐసీయూలో నిపుణుల పర్యవేక్షణలోనే చికిత్స కొనసాగుతోందని ఆ బులెటిన్ లో పేర్కొన్నారు.