Robert Weber: అటవీప్రాంతంలో తప్పిపోయిన ఆస్ట్రేలియా రాజకీయనేత... పుట్టగొడుగులు తింటూ ప్రాణాలు దక్కించుకున్న వైనం!

Missing Australian politician found at a dam

  • షికారుకు వెళ్లిన రాబర్ట్ వెబర్
  • బురదలో కూరుకుపోయిన కారు
  • కారులో మూడు రోజులు గడిపిన నేత
  • ఆకలికి తట్టుకోలేక అడవిలోకి పయనం
  • డ్యామ్ లో నీళ్లు, అడవిలో పుట్టగొడుగులే ఆహారం

అటవీప్రాంతాల్లో దారి తెలుసుకోవడం చాలా కష్టం. ఆస్ట్రేలియాకు చెందిన రాబర్ట్ వెబర్ అనే స్థానిక రాజకీయ నేతకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దారి తప్పి అడవిలోకి వెళ్లిన ఆయన ఏకంగా 18 రోజుల పాటు ఇంటికి దూరమయ్యాడు. పుట్టగొడుగులు తింటూ ప్రాణాలు కాపాడుకున్నాడు.

రాబర్ట్ వెబర్ ఇటీవల కిల్కివాన్ అనే పట్టణంలోని ఓ హోటల్ లో బస చేశాడు. ఒకరోజు తన కుక్కను తీసుకుని షికారుకు వెళ్లాడు. ఓ ప్రదేశంలో ఆయన కారు బురదలో కూరుకుపోయింది. కారును బయటికి తీసేందుకు ఆయన విశ్వప్రయత్నం చేశాడు. ఎంతకీ రాకపోవడంతో ఆ కారులోనే 3 రోజులు గడిపాడు. ఆకలి బాధకు తట్టుకోలేక ఆ కారును అక్కడే వదిలేసి దారితెన్నూ లేకుండా ముందుకు నడిచాడు.

ఓ డ్యామ్ కనిపించడంతో అక్కడే ఉంటూ పుట్టగొడుగులు తింటూ, నీళ్లు తాగుతూ 18 రోజులు గడిపాడు. ఓవైపు రాబర్ట్ వెబర్ మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు భారీస్థాయిలో గాలింపు చర్యలు జరిపి, ఇక తమ వల్ల కాదని గాలింపు నిలిపివేశారు. అయితే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అడవిలోని డ్యామ్ వద్ద ఉన్న వెబర్ ను గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో రాజకీయ నేత కథ సుఖాంతం అయింది.

  • Loading...

More Telugu News