Nimmagadda Ramesh Kumar: అపాయింట్ మెంట్ అడుగుతున్న అటు నిమ్మగడ్డ... ఇటు ఉద్యోగ సంఘాలు.. వేచిచూస్తున్న గవర్నర్!
- సుప్రీంలో ఏపీ పంచాయతీ ఎన్నికల వ్యవహారం
- కాసేపట్లో తీర్పు
- గవర్నర్ అపాయింట్ మెంట్ కోరుతున్న నిమ్మగడ్డ, ఉద్యోగ సంఘాలు
- ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వని గవర్నర్ కార్యాలయం!
ఏపీ పంచాయతీ ఎన్నికలపై కాసేపట్లో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. అయితే, తాజా పరిణామాలపై వివరించడానికి ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవాలనుకుంటున్నారు. అయితే గవర్నర్ కార్యాలయం నుంచి ఆయనకు క్లియరెన్స్ రాలేదు. నిమ్మగడ్డ మాత్రమే కాదు, రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా గవర్నర్ తో భేటీ కోసం ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు గవర్నర్ ఎవరికీ అపాయింట్ మెంట్ ఖరారు చేయలేదు. పంచాయతీ ఎన్నికల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున, తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.