Ayyanna Patrudu: విజయసాయిరెడ్డీ, ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదు కదా..?: అయ్యన్నపాత్రుడు
- షర్మిల కొత్త పార్టీ పెడుతోందంటూ ప్రచారం
- వ్యంగ్యంగా స్పందించిన అయ్యన్న
- ఓ చెల్లి బాబాయ్ హత్యకేసు తేల్చమంటోందని ట్వీట్
- మరో చెల్లి కొత్త పార్టీ పెడుతోందని వ్యాఖ్యలు
సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వ్యంగ్యంగా స్పందించారు. బాబాయ్ హత్య కేసు తేల్చమంటూ ఓ వైపు నుంచి ఒక చెల్లి అడుగుతోందని, సైకో వేషాలు భరించలేక ఇంకో చెల్లి కొత్త పార్టీ పెడుతోందని అయ్యన్న పేర్కొన్నారు. ఈ విధంగా రెండు వైపుల నుంచి జగ్గడు నలిగిపోతున్నాడు... ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదు కదా..? అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు.