Sensex: భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు
- 531 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 133 పాయింట్లు పతనమైన నిఫ్టీ
- రిలయన్స్ షేరుకు ఐదున్నర శాతానికి పైగా నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం మళ్లీ లాభాల్లోకి వచ్చి, ఆ తర్వాత మళ్లీ కుప్పకూలాయి. బ్యాంకింగ్ స్టాకులు లాభాల్లో ట్రేడ్ అయినా... దిగ్గజ సంస్థ రిలయన్స్ షేర్లు ఒత్తిడిని ఎదుర్కోవడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 531 పాయింట్లు పతనమై 48,347కి పడిపోయింది. నిఫ్టీ 133 పాయింట్లు కోల్పోయి 14,238 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఆటో (1.82%), యాక్సిస్ బ్యాంక్ (1.81%), హెచ్డీఎఫ్సీ (1.63%), సన్ ఫార్మా (1.55%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.23%).
టాప్ లూజర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (-5.60%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-5.55%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-3.86%), ఏసియన్ పెయింట్స్ (-2.92%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.84%).