YS Sharmila: ఆ పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవం: వైఎస్ షర్మిల

Sharmila reacts on a media story and told that was not true
  • షర్మిల పార్టీ పెడుతున్నారంటూ కథనం
  • తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన వైనం
  • ప్రకటన విడుదల చేసిన షర్మిల
  • చట్టపరమైన చర్యలకు వెనుకాడబోమని స్పష్టీకరణ
దివంగత వైఎస్సార్ కుమార్తె షర్మిల కొత్తగా పార్టీ పెడుతున్నారంటూ మీడియాలో వచ్చిన కథనం కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై వైఎస్ షర్మిల స్వయంగా స్పందించారు. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని, అవాస్తవాలను రాసిన పత్రిక, చానల్ పై చట్టపరమైన చర్యలకు తాము వెనుకాడబోమని షర్మిల హెచ్చరించారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. తమ కుటుంబాన్ని టార్గెట్ చేసేలా ఆ పత్రికలో రాతలు ఉన్నాయని ఆరోపించారు.
YS Sharmila
Political Party
Jagan
YSRCP
Andhra Pradesh
Telangana

More Telugu News