farmers: ఎర్రకోట ముట్టడి ఎఫెక్ట్: పార్లమెంట్ మార్చ్‌ను వాయిదా వేసిన రైతులు

Farmer Unions postpone March To Parliament

  • ఈ నెల 30న ఉపవాస దీక్ష, బహిరంగ ర్యాలీలు
  • సింఘు సరిహద్దులో మాట్లాడిన రైతు నేతలు
  •  అసాంఘిక శక్తుల ప్రవేశం వల్లే హింస చెలరేగిందన్న రైతులు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ అదుపు తప్పడం, ఎర్రకోట ముట్టడి హింసాత్మకంగా మారడంతో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రైతు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు రెండు సంఘాలు ప్రకటించి గంటలైనా గడవకముందే, ఫిబ్రవరి ఒకటో తేదీన తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‌ను వాయిదా వేస్తున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ (ఆర్) తెలిపింది.

సింఘు సరిహద్దు వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీకేయూ (ఆర్) నేత బల్బీర్ ఎస్ రాజేవాల్ మాట్లాడుతూ.. ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ర్యాలీలకు బదులుగా ఈ నెల 30న ఒక రోజు నిరాహార దీక్ష చేయనున్నట్టు చెప్పారు. అలాగే, ర్యాలీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడంపై రైతు నేతలు మాట్లాడుతూ ర్యాలీలోకి అసాంఘిక శక్తులు చొరబడడం వల్లే హింసాత్మకంగా మారిందన్నారు. దీని వెనక ప్రభుత్వ హస్తం ఉందని మరోమారు ఆరోపించారు.

  • Loading...

More Telugu News