Uttar Pradesh: నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం.. యూపీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయాలని నిర్ణయం!
- వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు
- బీజేపీతో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి
- బీహార్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్న జేడీయూ
బీజేపీతో కలిసి బీహార్‌ను పాలిస్తున్న జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండా, సొంతంగా తమ జేడీయూను బరిలోకి దింపాలని నిర్ణయించారు. తమ నిర్ణయంతో బీహార్‌లో తమ రెండు పార్టీల మధ్య ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి పేర్కొన్నారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలని జేడీయూ జాతీయ కమిటీ నిర్ణయించినట్టు తెలిపారు. యూపీలో జరిగిన గత ఎన్నికల్లో తాము పోటీ చేయకపోవడం వల్ల పార్టీకి నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించినట్టు చెప్పారు.