F3: మరోమారు వెంకీ, వరుణ్ ల హంగామాకు రంగం సిద్ధం... ఎఫ్3 రిలీజ్ డేట్ ప్రకటన!

Venkatesh and Varuntej new movie release date announced
  • ఎఫ్2తో నవ్వించిన అనిల్ రావిపూడి
  • సీక్వెల్ గా వస్తున్న ఎఫ్3
  • ఆగస్టు 27న రిలీజ్
  • వేగంగా సాగుతున్న చిత్రీకరణ
సీనియర్ హీరో వెంకటేశ్, మెగా హీరో వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన ఎఫ్2 ఎంతటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దిల్ రాజు బ్యానర్ పై యువ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో కామెడీకి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. ఇప్పుడీ కలయికలోనే ఎఫ్3 కూడా వస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. ఆగస్టు 27న ఎఫ్3 ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపింది. దాదాపు ఎఫ్2 చిత్రానికి పనిచేసిన వారే ఈ సీక్వెల్ కు కూడా పనిచేస్తున్నట్టు తెలిసింది.

లాక్ డౌన్ సమయంలో పక్కాగా స్ట్రిప్టు సిద్ధం చేసుకున్న అనిల్ రావిపూడి శరవేగంతో షూటింగ్ జరుపుతున్నారు. కాగా ఈ సినిమాలో వెంకటేశ్, వరుణ్ తేజ్ లతో పాటు సునీల్ కూడా నవ్విస్తాడని తెలుస్తోంది. ఇక ఎఫ్2లో కథానాయికలుగా అలరించిన తమన్నా, మెహ్రీన్ లే ఇందులోనూ మురిపించనున్నారు.
F3
Release Date
Venkatesh
Varun Tej
Anil Ravipudi
Tollywood

More Telugu News