Vijayasai Reddy: ఓటమి భయంతోనే మేనిఫెస్టో అంటూ కామెడీ చేస్తున్నారు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy comments on Chandrababu manifesto ahead of Panchayat Elections
  • త్వరలో ఏపీలో పంచాయతీ ఎన్నికలు
  • మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు
  • విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వైసీపీ నేతలు
  • ప్రజలు నిన్ను నమ్మరు బాబూ అంటూ విజయసాయి ట్వీట్
మరికొన్నిరోజుల్లో ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు 'పల్లె ప్రగతి-పంచ సూత్రాలు' పేరిట మేనిఫెస్టో విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఎన్నికలకు పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడం రాజ్యాంగ విరుద్ధమని వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయని, పార్టీ గుర్తులు, జెండాలు ఉండవన్న సంగతి 40 ఏళ్ల ఇండస్ట్రీకి కూడా తెలుసని ఎద్దేవా చేశారు. కానీ ఓటమి భయం తీవ్ర అలజడి రేపడంతో జనరల్ ఎలక్షన్స్ స్థాయిలో మేనిఫెస్టో అంటూ కామెడీ చేస్తున్నారని విజయసాయి విమర్శించారు. 'ఎన్ని పిల్లి మొగ్గలేసినా ప్రజలు నిన్ను నమ్మరు బాబూ' అంటూ వ్యాఖ్యానించారు.
Vijayasai Reddy
Chandrababu
Manifesto
Telugudesam
Gram Panchayat Elections

More Telugu News