Nara Lokesh: ఆ పని ఇప్పుడు తెలుగుదేశం చేసింది: నారా లోకేశ్
- స్థానిక ఎన్నికలకు మేనిఫెస్టో ఏంటి అని కొందరంటున్నారు
- ఇన్నాళ్లూ పల్లెల అభివృద్ధికి ప్రణాళికా తీసుకురాలేక పోయారు
- తెలుగుదేశం అభ్యర్థులను గెలిపిస్తే పల్లె ప్రగతి
- అందుకే పంచ సూత్రాలను రూపొందించాం
ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న విడుదల చేసిన విషయం తెలిసిందే. పల్లె ప్రగతి-పంచ సూత్రాల పేరిట ఆయన విడుదల చేసిన ఆ మేనిఫెస్టోపై వైసీపీ నేతల నుంచి విమర్శలు వస్తోన్న నేపథ్యంలో వారి వ్యాఖ్యలకు టీడీపీ నేత నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు.
'పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలకు మేనిఫెస్టో ఏంటి అని కొందరు మాట్లాడుతున్నారు. వాళ్లు అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లలో పల్లెల అభివృద్ధికి అంటూ ఏ ప్రణాళికా తీసుకురాలేక పోయారు. ఆ పని ఇప్పుడు తెలుగుదేశం చేసింది' అని నారా లోకేశ్ తెలిపారు
'తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చే అభ్యర్థులను గెలిపిస్తే పల్లె ప్రగతి ఏ రకంగా సాధ్యం చేసి చూపిస్తారో చెప్పే ప్రణాళిక ఇది. పల్లె ప్రగతికి పంచ సూత్రాలను రూపొందించడం జరిగింది' అని నారా లోకేశ్ తెలిపారు. పంచ సూత్రాలను తెలుపుతూ రూపొందించిన వివరాల జాబితాను ఈ సందర్భంగా ఆయన పోస్ట్ చేశారు.