Prabhas: మరో బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ ప్రాజక్ట్!

Prabhas to work with another Bollywood director
  • ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ 'సలార్'
  • బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో 'ఆదిపురుష్'
  • సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమా
  • ఇప్పటికే పూర్తయిన చర్చలు.. భారీ యాక్షన్ ఫిలిం  
'బాహుబలి', 'సాహో' చిత్రాలతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. తాజాగా 'రాధే శ్యామ్' చిత్రాన్ని పూర్తిచేశాడు. దీని తర్వాత ప్రస్తుతం మూడు చిత్రాలను చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్'లతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ చిత్రంలోనూ నటిస్తున్నాడు. వీటిలో ప్రస్తుతం 'సలార్', 'ఆదిపురుష్' సెట్స్ మీద వున్నాయి. ఈ ఏడాదల్లా ఈ చిత్రాలతో తను బిజీగా ఉంటాడు.

ఇదిలావుంచితే, ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో పనిచేస్తున్న ప్రభాస్ మరో బాలీవుడ్ దర్శకుడితో కూడా పనిచేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు హృతిక్ రోషన్ తో 'బ్యాంగ్ బ్యాంగ్', 'వార్' చిత్రాలను రూపొందించిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. ఈ ప్రాజక్టుకు సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయని, వీరి కలయికలో ఓ భారీ యాక్షన్ సినిమా తెరకెక్కనుందని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సిద్ధార్థ్ హిందీలో షారుఖ్, హృతిక్ లతో చెరో సినిమా చేస్తున్నాడు. ఇక ప్రభాస్, సిద్ధార్థ్ ప్రస్తుత కమిట్ మెంట్స్ పూర్తయ్యాక వీరి కాంబోలో సినిమా మొదలవుతుందట.
Prabhas
Prashanth Neel
Salar
Adipurush
Siddharth Anand

More Telugu News