Acharya: టీజర్ వెంటే మరో గుడ్ న్యూస్.... మే 13న 'ఆచార్య' గ్రాండ్ రిలీజ్

Megastar Chiranjeevi Acharya release date announced
  • ఈ సాయంత్రం 'ఆచార్య' నుంచి టీజర్ రిలీజ్
  • ఆ వెంటనే రిలీజ్ డేట్ వెల్లడి
  • వేసవిలో రానున్న 'ఆచార్య'
  • టీజర్ కు విశేష స్పందన
  • 'ధర్మస్థలి' కాన్సెప్ట్ పై అధికమవుతున్న ఆసక్తి
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఇవాళ డబుల్ ధమాకా అని చెప్పాలి. ఈ సాయంత్రం 4.05 గంటలకు 'ఆచార్య' టీజర్ రిలీజ్ చేసిన చిత్రబృందం, 5.30 గంటలకు 'ఆచార్య' గ్రాండ్ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. మే 13న 'ఆచార్య' ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని కొణిదెల ప్రొ కంపెనీ వెల్లడించింది. ఈ సాయంత్రం ఆన్ లైన్ లో విడుదలైన టీజర్ మెగా ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్న తరుణంలోనే సినిమా విడుదల తేదీని కూడా చిత్ర యూనిట్ వెల్లడించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సందేశాత్మక కమర్షియల్ చిత్రంలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఇటీవల వచ్చిన చిరంజీవి ఫస్ట్ లుక్ 'ఆచార్య' సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇందులో 'ధర్మస్థలి' కాన్సెప్ట్ పై అందరిలోనూ ఆసక్తి అధికమవుతోంది. 'ఆచార్య' చిత్రాన్ని కొణిదెల ప్రొ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Acharya
Release Date
Chiranjeevi
Koratala Siva
Teaser
Tollywood

More Telugu News