Tensions: సింఘు ప్రాంతం నుంచి రైతులు ఖాళీ చేయాలంటూ స్థానికుల ఆందోళన... మరోసారి ఉద్రిక్తతలు

Tensions raised at Singhu border

  • ఢిల్లీలో కొనసాగుతున్న రైతు నిరసనలు
  • సింఘు ప్రాంతంలో మకాం వేసిన రైతులు
  • రైతుల టెంట్లపై రాళ్ల దాడి చేసిన స్థానికులు
  • గుడారాలు పీకివేసే ప్రయత్నం
  • పోలీసుల లాఠీచార్జి

కేంద్ర వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు గత 65 రోజులుగా ఢిల్లీ సరిహద్దులో ఉద్యమం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. నిరసనల్లో పాల్గొంటున్న రైతులు సింఘు ప్రాంతంలో మకాం వేశారు. అయితే, రైతులు తమ ప్రాంతం నుంచి ఖాళీ చేయాలంటూ కొందరు వ్యక్తులు ఆందోళనకు దిగారు. రైతుల గుడారాలపై రాళ్లు విసిరారు. పలు గుడారాలను తొలగించే ప్రయత్నం చేశారు.

దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగగా, పోలీసులు రంగప్రవేశం చేశారు. ఓ దశలో లాఠీలకు పనిచెప్పిన పోలీసులు, పరిస్థితి అప్పటికీ అదుపులోకి రాకపోవడంతో బాష్పవాయువు ప్రయోగించారు. ఈ క్రమంలో పలువురు పోలీసులకు కూడా గాయాలు తగిలినట్టు సమాచారం. కాగా, రైతులు ఖాళీ చేయాలంటూ ఆందోళనకు దిగిన వారు తమను స్థానికులుగా పేర్కొన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News