Madurai: సిద్ధమైన జయలలిత, ఎంజీఆర్ ‌ల దేవాలయం.. నేడు ప్రారంభించనున్న సీఎం పళనిస్వామి

Tamil Nadu Ex CM Jayalalitha temple ready in Madurai

  • మధురైలోని కల్లుపట్టిలో ఒకటిన్నర ఎకరాల్లో  ఆలయ నిర్మాణం
  • ఆలయాన్ని నిర్మించిన ఉదయ్ కుమార్  
  • కొలువైన జయలలిత, ఎంజీ రామచంద్రన్ కాంస్య విగ్రహాలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత, ఆమె రాజకీయ గురువు ఎంజీ రామచంద్రన్‌ కాంస్య విగ్రహాలతో కూడిన దేవాలయం సిద్ధమైంది. మధురైలోని కల్లుపట్టిలో ఒకటిన్నర ఎకరాల స్థలంలో, రూ. 50 లక్షల వ్యయంతో ఆలయాన్ని నిర్మించారు.

జయలలిత కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఉదయ్‌కుమార్ ఈ ఆలయాన్ని నిర్మించారు. జయలలితను తాము తమ హృదయ దేవత, గార్డియన్ దేవత, తమ తెగ దేవతగా పిలుస్తామని, అమ్మ (జయలలిత)ను ఆరాధించేందుకే ఆలయాన్ని నిర్మించినట్టు ఉదయ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నేడు ఈ దేవాలయాన్ని ప్రారంభించనున్నారు.

మరోవైపు రూ. 79 కోట్లతో ఫీనిక్స్ ఆకారంలో నిర్మించిన జయలలిత స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి పళనిస్వామి ఇటీవల ప్రారంభించారు. జయ నివాసమైన పోయెస్ గార్డెన్‌ను స్మారక చిహ్నంగా మార్చారు. కాగా, త్వరలో రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల సానుభూతిని సంపాదించేందుకే ర్ ఆలయాన్ని నిర్మించారంటూ ప్రతిపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News