Uttar Pradesh: బస్సు, ట్రక్కు, మరో వాహనం ఢీ.. పది మంది మృతి, 25 మందికి గాయాలు
- యూపీలో ఆగ్రా–మొరాదాబాద్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
- మంచులో వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు
- పరిహారం ప్రకటించిన యూపీ సీఎం యోగి
- చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు
- గాయపడిన వారికి రూ.50 వేలు
దట్టంగా కురుస్తున్న మంచు.. ఆ మంచులోనే మరో వాహనాన్ని దాటాలన్న ఆత్రుత.. వెరసి పది ప్రాణాలను బలి తీసుకుంది. 25 మందిని ఆస్పత్రి పాల్జేసింది. శనివారం తెల్లవారు జామున ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా–మొరాదాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు, లారీ, మరో వాహనం ఢీకొట్టుకున్నాయి.
ముందున్న మరో వాహనాన్ని ఓ బస్సు దాటే క్రమంలో లారీని ఢీకొట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారని మొరాదాబాద్ ఎస్ఎస్ పీ తెలిపారు. ఫోరెన్సిక్ టీం అక్కడ ఆధారాలు సేకరిస్తోందని, సహాయ చర్యలు చేపట్టామని చెప్పారు. ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేసి, సంతాపం తెలిపారు.
చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి సరైన చికిత్స అందేలా ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.