Telugudesam: మేనిఫెస్టోపై వివరణ ఇవ్వండి: టీడీపీకి ఎస్ఈసీ నోటీసులు
- ఇప్పటికే ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు
- వచ్చేనెల 2వ తేదీలోపు వివరణ ఇవ్వాలన్న ఎస్ఈసీ
- మేనిఫెస్టో విడుదల సరైనది కాదని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో విడుదల చేసిన విషయం తెలిసిందే. పల్లె ప్రగతి-పంచ సూత్రాల పేరిట ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. దీనిపై ఇప్పటికే ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేయడం సరికాదని వ్యాఖ్యానించింది.
ఈ నేపథ్యంలో టీడీపీ మేనిఫెస్టో విడుదలపై ఆ పార్టీ వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఎస్ఈసీ టీడీపీకి నోటీసులు జారీచేసింది. వచ్చేనెల 2వ తేదీలోపు వివరణ ఇవ్వాలని తెలిపింది. పార్టీలకు అతీతంగా జరిగే స్థానిక ఎన్నికలలో మేనిఫెస్టో సరైనది కాదని ఎస్ఈసీ అంటున్నారు.