Balakrishna: బాలకృష్ణ, బోయపాటి చిత్రం రిలీజ్ డేట్ ఇదిగో!

Release date announced for Balakrishna and Boyapati third movie
  • బాలయ్య, బోయపాటి కాంబోలో మూడో చిత్రం
  • మే 28న రిలీజ్
  • గతంలో బాలయ్య, బోయపాటి కాంబోలో సింహా, లెజెండ్
  • షూటింగ్ జరుపుకుంటున్న మూడో చిత్రం
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించారు. బీబీ3గా పిలుస్తున్న ఈ చిత్రం మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. టైటిల్ ఇంకా నిర్ణయం కాని ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. గతంలో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలకు దీటుగా ఈ మూడో చిత్రం ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

కాగా ఈ చిత్రం బాలయ్యకు 106వ సినిమా. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైశ్వాల్ కథానాయిక. తమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా బీబీ3కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, ఇతర అప్ డేట్లు అభిమానులను విశేషంగా అలరించాయి.
Balakrishna
Boyapati Sreenu
BB3
Release Date
Tollywood

More Telugu News