Sasikala: జ్యోతిష్యుడి సూచన మేరకు నిర్ణయం తీసుకోనున్న శశికళ!

Sasikala to take decision on Chennai going according to astrologers suggestion
  • శశికళ చెన్నై ఎప్పుడు వెళ్తారనే విషయంపై ఉత్కంఠ
  • ఫిబ్రవరి 3, 5, 8, 11 తేదీల్లో వెళ్లాలని సూచించిన జ్యోతిష్యుడు
  • ఈ తేదీల్లో వెళ్తే అంతా శుభం జరుగుతుందని చెప్పిన జ్యోతిష్యుడు
దివంగత జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే పార్టీ మాజీ నాయకురాలు శశికళ  బెంగళురులోని విక్టోరియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నాలుగేళ్ల పాటు జైల్లో ఉన్న శశికళ స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. ఆసుపత్రి నుంచి ఆమె విడుదల కావడంతో తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. ఆమె భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోందనే ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు, ఆమె చెన్నైకి ఎప్పుడు వెళతారనే చర్చ కొనసాగుతోంది. అయితే, దీనికి సంబంధించి ఒక ఆసక్తికర వార్త వినపడుతోంది. తిరువణ్ణామలైకి చెందిన ఓ జ్యోతిష్యుడి సూచన మేరకు ఆమె నడుచుకుంటున్నారనేదే ఆ వార్త సారాంశం.

జ్యోతిష్యుడు సూచించిన ఫిబ్రవరి 3, 5, 8, 11 తేదీల్లో ఏదో ఒక రోజున ఆమె చెన్నై వెళతారని తెలుస్తోంది. ఈ తేదీల్లో వెళ్తే అంతా శుభం జరుగుతుందని జ్యోతిష్కుడు శశికళకు సూచించారట. ఆసుపత్రి నుంచి విడుదలయ్యాక బెంగళూరు లేదా హైదరాబాదులోని ఫామ్ హౌస్ లో ఆమె విశ్రాంతి తీసుకుంటారనే ప్రచారం నిన్నటివరకు జరిగింది. అయితే, ఇప్పుడామె కర్ణాటకలోని నందిహిల్స్ శివార్లలోని రిసార్ట్ కు వెళుతున్నట్టు తెలుస్తోంది. 
Sasikala
AIADMK
Chennai

More Telugu News