Mayanmar: మయన్మార్ లో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న ఇండియా!
- ఈ ఉదయం మయన్మార్ లో సైనిక తిరుగుబాటు
- ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించాలి
- ప్రకటన విడుదల చేసిన విదేశాంగ శాఖ
మయన్మార్ లో ఈ ఉదయం జరిగిన సైనిక తిరుగుబాటు పట్ల భారతదేశం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని వ్యాఖ్యానించింది.
మయన్మార్ లో ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించాలని పొరుగున ఉన్న దేశంగా ఇండియా కోరుకుంటోందని, ఆ దేశంలో నెలకొన్న పరిస్థితులను పరిశీలిస్తున్నామని పేర్కొంది. ఇటీవల విజయం సాధించిన అంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు ఇష్టపడని సైన్యం, దేశం మొత్తాన్ని తన అధీనంలోకి తీసుకోవడంతో పాటు పలువురు అధికార పార్టీ నేతలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.