Union Budget 2021-22: కేంద్ర బడ్జెట్: మరిన్ని ముఖ్యాంశాలు.. వివిధ కేటాయింపులు!
- పెట్టుబడుల ఉపసంహరణకు పెద్దపీట
- ప్రవాసులపై మరిన్ని వరాలు
- అక్టోబర్ 21 నుంచి కొత్త కస్టమ్స్ పాలసీ
- మరింత సులభం కానున్న సొంతిల్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-2022 బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా నేడు లోక్ సభ ముందు ఉంచిన కేటాయింపుల్లో మరిన్ని ముఖ్యాంశాలు
* ఈ సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణపై మరింత దృష్టి
* ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్ సిగ్నల్
* ఐడీబీఐ, భారత్ ఎర్త్ మూవర్స్ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్ సిగ్నల్
* 2021-22లో పవన్ హాన్స్, ఎయిరిండియా ప్రైవేటీకరణ
* రైతుల సంక్షేమానికి కట్టుబడి వున్న ప్రభుత్వం
* వ్యవసాయ రంగానికి మరిన్ని నిధులు
* కనీస మద్దతు ధరకు రూ. 1.72 లక్షల కోట్ల వ్యయం
* 2020-21లో రైతు సంక్షేమానికి రూ. 75 వేల కోట్లు
* 1.5 కోట్ల మంది రైతులకు లబ్ధి
* రైతు రుణాల లక్ష్యం రూ. 16.5 లక్షల కోట్లు
* మౌలిక రంగానికి భారీగా నిధులు
* గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.40 వేల కోట్లు
* ఉత్పత్తి రంగానికి ప్రత్యేక ఆర్థిక సంస్థ
* విద్యుత్ రంగానికి రూ. 3.05 లక్షల కోట్ల కేటాయింపు
* పీపీపీ పద్ధతి ద్వారా 7 కొత్త ప్రాజెక్టులు
* వాటి అభివృద్ధి నిమిత్తం రూ. 2,200 కోట్ల కేటాయింపు
* ఉజ్వల స్కీమ్ కింద మరో 9 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు
* జమ్మూ కశ్మీర్లో నూతనంగా గ్యాస్ పైప్లైన్ ఏర్పాటు
* సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి రూ.1000 కోట్లు
* బ్యాంక్ ఖాతాదారులకు ఇన్సూరెన్స్ రూ. 1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు
* బీమా రంగంలో ఎఫ్డీఐలు 74 శాతానికి పెంపు
* రూ.2 వేల కోట్లకు మించిన విలువతో 7 కొత్త నౌకాశ్రయాలు
* ప్రజలకు రక్షిత మంచినీటి పథకాల కోసం రూ. 87 వేల కోట్లు
* కాలుష్యాన్ని తగ్గించడంపై మరింత దృష్టి
* ఇండియా పర్యావరణ రహితంగా ఉండాలి
* నేషనల్ డిసిజ్ కంట్రోల్ సిస్టం మరింత పటిష్టం
* దేశ వ్యాప్తంగా 15 ఎమర్జెన్సీ సెంటర్లు
* పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ. 1.75 లక్షల కోట్లు
* పన్ను మినహాయింపులు మరో ఏడాది పెంపు
* ఇల్లు కట్టుకునే మధ్య తరగతి వర్గానికి మరింత ఊరట
* టాక్స్ ఆడిట్ పరిమితి రూ. 10 కోట్లకు పెంపు
* ప్రవాస భారతీయులకు మినహాయింపు
* కనీసం 120 రోజులు ప్రవాసంలో ఉన్న వారికే వర్తింపు
* అక్టోబర్ 21 నుంచి కొత్త కస్టమ్స్ పాలసీ
* రాగిపై పన్ను మినహాయింపులు
* సోలార్ ఇన్వర్టర్లపై అదనపు పన్నులు
* జాతీయ స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యేక డ్యాష్ బోర్డు
* కాటన్ పై 10 శాతం అదనపు పన్ను