Maharashtra: పల్స్ పోలియోలో సిబ్బంది నిర్లక్ష్యం.. పోలియో చుక్కలకు బదులుగా శానిటైజర్!

12 Yavatmal toddlers given hand sanitiser instead of polio drops
  • మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో ఘటన
  • నిలకడగా చిన్నారుల ఆరోగ్యం
  • ముగ్గురిపై వేటేయనున్నట్టు చెప్పిన అధికారులు
పల్స్‌పోలియో కార్యక్రమంలో సిబ్బంది నిర్లక్ష్యం చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది. పోలియో చుక్కలకు బదులుగా హ్యాండ్ శానిటైజర్ వేయడంతో 12 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా కప్పికోప్రి గ్రామంలో జరిగిందీ ఘటన. పోలియో చుక్కలు వేసిన కాసేపటికే చిన్నారులు అస్వస్థతకు గురికావడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.

వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని, వారి ఆరోగ్య  పరిస్థితి నిలకడగానే ఉందని యావత్మాల్ జిల్లా పరిషత్ సీఈవో శ్రీకృష్ణ పంచాల్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేసిన సమయంలో పీహెచ్‌సీ వద్ద ఒక వైద్యుడు, అంగన్‌వాడీ కార్యకర్త, ఆశా వలంటీర్ ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టు చెప్పారు. ఆ ముగ్గురినీ సస్పెండ్ చేయనున్నట్టు పేర్కొన్నారు.
Maharashtra
Yavatmal
Sanitiser
Polio Drops

More Telugu News