england: భారత్‌పై ఇంగ్లండ్ ఒక్క టెస్టు మ్యాచూ గెలవకపోవచ్చు: గంభీర్
- త్వరలో సిరీస్ ప్రారంభం
- ఆసీస్‌లో బలహీనమైన స్పిన్ విభాగం
- కెప్టెన్ రూట్‌కు భారత్‌లో మాత్రం విభిన్నమైన సవాలు
భారత్-ఇంగ్లండ్ మధ్య త్వరలో 4 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచులు జరగనున్న విషయం తెలిసిందే. వచ్చేనెల 5 నుంచి చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచు ప్రారంభం కానుంది. టెస్టు సిరీస్‌లో భారత్‌పై ఇంగ్లండ్ కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా గెలుస్తుందని తాను అనుకోవట్లేదని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నారు.
ఆసీస్‌లో బలహీనమైన స్పిన్ విభాగం ఉందని చెప్పారు. ఈ సిరీస్‌ను భారత్ 3-0తో గెలుస్తుందని, లేదంటే 3-1తో అయినా సొంతం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అది కూడా గులాబి బంతి మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకుంటేనే ఇంగ్లండ్‌కు ఒక్క మ్యాచ్ గెలిచే అవకాశం ఉందని చెప్పారు. అటువంటి మ్యాచ్‌లో కూడా గెలిచే చాన్స్ 50-50 గా ఉంటాయని తెలిపారు.
భారత పర్యటన ముందు శ్రీలంకలో మ్యాచులు ఆడి గెలిచిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ రూట్‌కు భారత్‌లో మాత్రం విభిన్నమైన సవాలు ఎదురు కానుందని చెప్పారు. భారత బౌలర్లు బుమ్రా, అశ్విన్‌లను ఎదుర్కోలేరని తెలిపారు. కాగా, వన్డేలు, టెస్టుల్లో విరాట్ కోహ్లీ సారథ్యం బాగుందని గంభీర్ తెలిపారు. టీ20ల్లో మాత్రమే కోహ్లీ కెప్టెన్సీని తాను మొదటి నుంచి ప్రశ్నిస్తున్నానని చెప్పారు.