CCTV: ప‌ట్టాభిపై దాడి దృశ్యాల‌ను సీసీటీవీలో గుర్తించిన పోలీసులు

police finds accuse in cctv

  • సీసీటీవీ దృశ్యాల ఆధారంగా విచార‌ణ‌
  • నిందితుల కోసం గాలింపు చ‌ర్య‌లు
  • 15 మంది దాడి చేసిన‌ట్లు అనుమానాలు

విజ‌య‌వాడ‌లోని గురునాన‌క్ న‌గ‌ర్‌లో తెలుగు దేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై కొంద‌రు దాడికి పాల్ప‌డ్డ విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై  పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా సీసీటీవీ కెమెరాలు ప‌రిశీలించిన పోలీసులు దాడి దృశ్యాలను గుర్తించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చ‌ర్య‌లు ప్రారంభించారు.

కారులో ఉన్న‌ ప‌ట్టాభిపై నాలుగు వైపుల నుంచి దుండ‌గులు దాడి చేశారని వారు గుర్తించిన‌ట్లు తెలిసింది. అనంత‌రం బైకుల‌పై వారంతా అక్క‌డి నుంచి పారిపోయారని వారు తెలుసుకున్నారు. కాగా, ప‌ట్టాభిపై దాడి జ‌రిగినట్టు త‌మ‌కు ఉద‌యం 11 గంట‌ల‌కు స‌మాచారం అందింద‌ని పోలీసులు మీడియాకు తెలిపారు.

దీంతో వెంట‌నే ప‌ట్టాభి ఇంటికి వ‌చ్చామ‌ని చెప్పారు. ప‌ట్టాభి టీడీపీ కార్యాల‌యానికి వెళ్తుండ‌గా ఈ దాడి జ‌రిగింద‌న్నారు. దాదాపు 15 మంది దాడిలో పాల్గొన్న‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల‌ను గుర్తించి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News