Namitha: తన అధిక బరువుకు కారణమేంటో చెప్పిన సినీ నటి నమిత

Namitha reveals the reasons behind her over weight
  • సోషల్ మీడియాలో నమిత రూపంపై పుకార్లు
  • మద్యపానంతో లావైపోయిందని ప్రచారం
  • తనకు థైరాయిడ్ ఉందన్న నమిత
  • అధిక బరువుకు పీసీఓడీ కూడా కారణమేనని వెల్లడి
ఒకప్పుడు తన అందచందాలతో దక్షిణాది ప్రేక్షకులను కట్టిపడేసిన నమిత పెళ్లయిన తర్వాత అడపాదడపా నటిస్తోంది. 2017లో ఆమె తెలుగు కుర్రాడు వీరేంద్ర చౌదరిని పెళ్లాడింది. అయితే, ఇటీవలే నమిత ఆకారంపై సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతోంది. మద్యపానం కారణంగా అమ్మడు బాగా లావైపోయిందని పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై నమిత స్పందించక తప్పలేదు. తన అధిక బరువుకు థైరాయిడ్, పీసీఓడీనే కారణమని వెల్లడించింది.

అంతే తప్ప, జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను 97 కేజీల బరువున్నానని, అందులో దాపరికం ఏదీ లేదని వివరించింది. అనేక మానసిక ఒత్తిళ్లతో జీవితాన్ని కోల్పోతున్న ఫీలింగ్ కలిగిందని, ఆ సమయంలో యోగా ద్వారా మానసిక ప్రశాంతతను తిరిగి పొందగలిగానని ఈ గుజరాతీ భామ చెప్పుకొచ్చింది.
Namitha
Weight
Thyroid
PCOD
Social Media

More Telugu News